SIR : ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలి.. ఎమ్మెల్యే బాలు నాయక్..!
చింతపల్లి మండలం కుర్మేడు ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న 18వ బూత్ పరిధిలోని ఓటర్ల ఎన్యుమరేషన్ పత్రాలను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదివారం సంబంధిత బీఎల్‌ఓ, బూత్ లెవెల్ అధికారులకు అందజేశారు.

SIR : ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలి.. ఎమ్మెల్యే బాలు నాయక్..!
చింతపల్లి, మన సాక్షి..
చింతపల్లి మండలం కుర్మేడు ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న 18వ బూత్ పరిధిలోని ఓటర్ల ఎన్యుమరేషన్ పత్రాలను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదివారం సంబంధిత బీఎల్‌ఓ, బూత్ లెవెల్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ప్రత్యేక సమగ్ర సర్వే సర్ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేలా అధికారులు నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరు తన వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని, మార్పులు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించి పూర్తి చేయాలని ఓటర్లకు ఎమ్మెల్యే సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సర్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక బీఎల్‌ఓ మరియు సంబంధిత అధికారులకు 18వ బూత్ పరిధిలోని ఓటర్ల ఎన్యుమరేషన్ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, బిఎల్ఒ లు , పార్టీ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అంగరేకులు నాగభూషణం కురుమేటి రామకృష్ణ, ఉప్పు శ్రీశైలం , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జటావత్ హరి నాయక్, గొల్లపల్లి సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ పూరి తండా సర్పంచ్ శ్రీను నాయక్ , అనంతల జంగయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.










