Paddy : ఆ ఏడు రకాల సన్న వరి రకాలను సాగు చేసిన రైతులకే ప్రత్యేక బోనస్.. తేల్చి చెప్పిన ఉన్నతాధికారి..!
వానాకాలం సీజన్‌లో వ్యవసాయ శాఖ సూచించిన ఏడు రకాల సన్న వరి రకాలను ప్రోత్సహిస్తోందని ఆ రకాలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రత్యేక బోనస్ అందజేస్తుందని, అందువల్ల రైతులందరూ సన్న రకాల విత్తనాలను సాగు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ బి. గోపి సూచించారు.

Paddy : ఆ ఏడు రకాల సన్న వరి రకాలను సాగు చేసిన రైతులకే ప్రత్యేక బోనస్.. తేల్చి చెప్పిన ఉన్నతాధికారి..!
సూర్యాపేట, మనసాక్షి :
వానాకాలం సీజన్‌లో వ్యవసాయ శాఖ సూచించిన ఏడు రకాల సన్న వరి రకాలను ప్రోత్సహిస్తోందని ఆ రకాలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రత్యేక బోనస్ అందజేస్తుందని, అందువల్ల రైతులందరూ సన్న రకాల విత్తనాలను సాగు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ బి. గోపి
సూచించారు.
సూర్యాపేట మండలంలోని కేసారం రైతు వేదికలో ఈ రోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం విత్తన మేళా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం మండల పరిధిలోని రైతు వేదికల్లో విత్తనాల పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, అవసరమైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అదేవిధంగా, ఎరువుల పంపిణీ పూర్తిగా పారదర్శకంగా జరిగేలా రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియాను తీసుకోవాలని సూచించారు. అందరూ ఒకేసారి దుకాణాలకు రాకుండా క్రమపద్ధతిలో ఎరువులు పొందాలని, తద్వారా రద్దీ తగ్గడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా నియంత్రించవచ్చని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా భూసారాన్ని కాపాడడంతో పాటు తక్కువ వ్యయంతో అధిక లాభాలు పొందవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు మండలంలోని అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.









