Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ సైజు పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో మొదటగా ఇల్లు లేని వారికి ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తుంది. లబ్ధిదారులకు విడతల వారీగా ఐదు లక్షల రూపాయలను అందిస్తుంది. ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంలో స్లాబ్ సైజు పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ సైజు పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో మొదటగా ఇల్లు లేని వారికి ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తుంది. లబ్ధిదారులకు విడతల వారీగా ఐదు లక్షల రూపాయలను అందిస్తుంది. ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంలో స్లాబ్ సైజు పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
లబ్ధిదారుడు స్లాబ్ సైజు 500 అడుగుల నుంచి 750 అడుగుల వరకు మాత్రమే నిర్మాణం చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్ జీవో విడుదల చేశారు. స్లాబ్ ముందు వైపు మూడు అడుగులు, మిగతావైపులా ఒక్క అడుగు మాత్రమే ఉండాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.
పేద మధ్యతరగతి వారు నిర్మించుకునే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో స్లాబ్ సైజు పెంచితే లబ్ధిదారులకు అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో పరిమితులు విధిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. స్లాబ్ సైజు పెంచడం వల్ల ప్రభుత్వం అందజేసే ఐదు లక్షల రూపాయలు సరిపోక లబ్ధిదారుడికి ఆర్థిక భారం పడనున్నది.
అయితే ఇండ్లకు నీడ అవసరం ఉంటే తలుపులు, కిటికీలు, సన్ షెడ్ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అవసరమైతే Rcc స్లాబ్ కు బదులుగా జిఐ షీట్లు ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు సూచించాలని పేర్కొన్నది.
ఈ ఉత్తర్వులు.. కొత్త నిబంధనలు ప్రస్తుతం పునాది దశ, బేస్మెంట్ లెవెల్, గ్రౌండింగ్ లో ఉన్న, ఇంకా నిర్మాణం ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశాలలో పేర్కొన్నది.