Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : అర్వపల్లి లో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. గాంధీ భవన్ చేరిన పంచాయతీ..!

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో గత కొ ద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ రాజకీయాలు ఒక్క సారిగా రోడ్డుకెక్కింది. అర్వపల్లి మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఇరువర్గాల దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లింది. సినిమా సీన్లను తలపించేలా సాగిన ఈ ఘర్షణ నియోజకవర్గంలో తీవ్రకలకలం రేపింది.

Suryapet : అర్వపల్లి లో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. గాంధీ భవన్ చేరిన పంచాయతీ..!

గాంధీభవనం వెళ్తున్న వారి పైన సామెల్ వర్గం దాడి.. పోలీసుల లాటి ఛార్జి

అర్వపల్లి, మనసాక్షి

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో గత కొ ద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ రాజకీయాలు ఒక్క సారిగా రోడ్డుకెక్కింది. అర్వపల్లి మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఇరువర్గాల దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లింది. సినిమా సీన్లను తలపించేలా సాగిన ఈ ఘర్షణ నియోజకవర్గంలో తీవ్రకలకలం రేపింది.

గాంధీభవన్‌ టార్గెట్..మధ్యలోనే అటాక్

ఎమ్మెల్యే వర్గానికి, పార్టీలోని సీని యర్ నాయకులకు మధ్య నడు స్తున్న తీవ్ర విభేదాల నేపథ్యంలో.. తమకు జరుగుతు న్న అన్యాయా న్ని అధిష్టానానికి మొరపెట్టుకోవ డానికి సీని యర్ నేతలు ‘చలో గాం ధీభవన్’ కార్యక్రమానికి పిలుపుని చ్చారు. దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వ ర్గానికి చెందిన సీనియర్ నాయకులంతా కలిసి ధరూర్ యో గానంద చారి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్‌తో హైదరాబా ద్‌కు బయలుదేరారు.
అయితే, ఈ పర్యటనను అడ్డుకు నేందుకు ఎమ్మెల్యే వర్గీ యులుగా భావిస్తున్న కొందరు ఒక్కసారిగా సీనియర్ల కాన్వా య్‌పై రాళ్లదాడికి దిగారు.

దీంతో ఇరువర్గాలు రోడ్డుపైనే
పరస్పరం దాడులు, ప్రతిదాడు లు చేసుకోవడంతో అర్వపల్లి రణ రంగంగా మారింది.దాడుల్లో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలకు చెందిన పలు వురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఇప్పటికే సెక్షన్ 30 అ మలులో ఉన్నప్పటికీ ఈ ఘర్షణ జరగడం గమనార్హం. పరిస్థితి చేతు లు దాటడంతో పోలీసులు రంగప్ర వే శం చేసి, లాఠీఛార్జ్ చేసి జనాలను చెదరగొట్టారు.

యోగానందచారి’ కాన్వాయ్ వెనక్కి తగ్గలేదు

పోలీసుల లాఠీఛార్జ్, ప్రత్యర్థుల రాళ్లదాడి సృష్టించిన బీభత్సంలోనూ సీనియర్ నాయకుడు ధరూర్ యోగానంద చారి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని ప్రతిఘటిస్తూనే, శ్రేణులను సమాయత్తం చేసుకుని హై దరాబాద్ వైపు దూసుకెళ్లారు. ఇప్పటికే ఈ వర్గానికి చెందిన పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌ కు చేరుకున్నట్లు సమాచారం.

అధిష్టానం మౌనం.. తటస్థుల్లో ఆందోళన
నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు ఇలా బహి రంగంగా వీధులకెక్కి కొట్టుకోవడం పై కాంగ్రెస్ తటస్థ నాయకులు, కా ర్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చే స్తున్నారు. గత వారం రోజులుగా అర్వపల్లి వేదికగా ఉద్రిక్త తలు పెరుగుతున్నా అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ, ఇటు జిల్లా డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య కానీ కనీసం జోక్యం చేసుకోకపోవడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మీడి యాలో ఈ విజువల్స్ హల్‌చల్ చేస్తున్నా జిల్లా మంత్రులు, పీసీసీ ఎందుకు మౌన వ్రతం వహించారనేది మిస్టరీగా మారింది.

సేవ్ కాంగ్రెస్ అంటూ.. గాంధీభవన్ వద్ద నిరసన

ఈ హైడ్రామా ఇలా ఉంటే, ఇప్పు డు అందరిలోనూ ఒకటే ఉ త్కంఠ నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య, దాడులను తట్టుకు ని గాంధీభవన్‌ కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ కబంద హస్తం నుండి కాంగ్రెస్ పార్టీ ని కాపాడాలని ధర్నా చేశారు. దీనితో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని ఇటీవల ఇటీవల ప్రకటించిన మండల కంపెనీ రద్దుచేసి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి వినయ్ విధేయత గా ఉన్న వ్యక్తులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు