విద్యా వ్యాపారం.. కమిషన్ల కోసం కక్కుర్తి..!
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. పాఠశాల ఆరంభంలోనే తమ వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. రామగుండం పారిశంక ప్రాంతంలోని పలు ప్రైవేటు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి. బుక్ స్టాల్ నిర్వాహకులతో కుమ్మక్కై అధిక ధరలకు బుక్స్ యూనిఫామ్ బెల్టు స్టేషనరీలు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

విద్యా వ్యాపారం.. కమిషన్ల కోసం కక్కుర్తి..!
గోదావరిఖని, మన సాక్షి :
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. పాఠశాల ఆరంభంలోనే తమ వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. రామగుండం పారిశంక ప్రాంతంలోని పలు ప్రైవేటు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి. బుక్ స్టాల్ నిర్వాహకులతో కుమ్మక్కై అధిక ధరలకు బుక్స్ యూనిఫామ్ బెల్టు స్టేషనరీలు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
మరికొన్ని పాఠశాలలు తమ సమీపంలో గదులను తీసుకొని రహస్యంగా అమ్మకాలు జరుపుతున్నారు. స్థానిక పవర్ హౌస్ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాల మార్కండేయ కాలనీలో కరీంనగర్ కు చెందిన ఓ బుక్ స్టాల్ నిర్వాహకుడితో కుమ్మక్కై ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే కొనుగోలు చేయాలని సూచిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పుస్తకాలు కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడం విశేషం.
సదరు పాఠశాల ఈ విద్యా సంవత్సరం నూతనంగా రెండు యూనిఫాంలు తీసుకువచ్చినట్లు సమాచారం. యధావిధిగా ఉండే స్కూల్ డ్రెస్ తో పాటు మరో రెండు స్కూల్ డ్రెస్సులు తీసుకోవాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అలాగే స్థానిక ఎన్టిపిసి లోని ఓ ప్రైవేటు పాఠశాల మరో అడుగు ముందుకేసి తల్లిదండ్రులు పుస్తకాల కోసం డబ్బులు చెల్లిస్తే ఇంటి వద్దకే పంపిస్తామంటూ తమ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నాయి.
డబ్బులు చెల్లి స్తే డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆన్లైన్లో పేమెంట్ చేస్తే రెండు రోజుల్లో కావాల్సిన పుస్తకాలు, నోటు బుక్స్ మీ ఇంటి వద్దకే పంపిస్తున్నారు. తమ వ్యాపారం సాఫీగా సాగేందుకు యాప్ తయారుచేసి దాని ద్వారా కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు సందేశాలు పంపిస్తున్నారు. అలాగే నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాల యూనిఫామ్ అమ్మకాల కోసం పాఠశాల సమీపంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మరీ విక్రయాలు చేస్తున్నారు.
ఒక్క విద్యార్థికి మూడు రకాల యూనిఫాంలు తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తూ అమ్మకాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు చేసేదేం లేక తప్పని పరిస్థితిలో కొనుగోలు చేస్తున్నారు. మరో కార్పొరేట్ పాఠశాల పాఠశాల సమీపంలోని ఓ గదిలో పుస్తకాలు, యూనిఫాంలు నిల్వ చేసి విక్రయిస్తున్నారు.
చూసి చూడనట్లు విద్యా శాఖ :
ప్రైవేటు వాజమాన్యాలు బహిరంగంగా వ్యాపారం చేస్తున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు చూసీచూన్నట్టు వివరిస్తున్నారని పలువు విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే అడపా దడపా అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్న గదులను సీజ్ చేస్తున్నారు. కొన్ని రోజులు సద్దుమణిగా మళ్లీ అమ్మకాలు సాగిస్తున్నారు. మామూలుగా మారింది ప్రభుత్వ నిబంధనాలకు విరుద్ధంగా విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.









