తిరుపతిలో జంట హత్య కలకలం.. మహిళ సూత్రధారి..?
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో గురువారం ఒక్కసారిగా జంట హత్యల కలకలం రేగింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్ లో శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

తిరుపతిలో జంట హత్య కలకలం.. మహిళ సూత్రధారి..?
మన సాక్షి :
ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో గురువారం ఒక్కసారిగా జంట హత్యల కలకలం రేగింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్ లో శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన వారిలో జీవకోనకు చెందిన మణిరత్నం, మనికంఠ గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళుతుండగా ఈ దారుణమైన సంఘటన జరిగింది.
ప్రత్యర్ధులు కాపుగాసి రెండు బైకులపై వీరిని వెంబడించి లక్ష్మీపురం సర్కిల్ వద్దకు రాగానే అడ్డుకొని విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. కత్తిపోటుకు గురైన వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు కొనఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ హత్య జరిగిన సమయంలో కొంతమంది సెల్ ఫోన్లలో వీడియోలను తీశారు. ఆ వీడియోల ఆధారంగా ఈ హత్యలో నలుగురు పురుషులతో పాటు ఒక మహిళ కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య అనంతరం నిందితులు రెండు బైకులపై పరారైనట్లు తెలుస్తుంది. ఘటన సమాచారాన్ని తెలుసుకున్న డి.ఎస్.పి భక్తవత్సలం, ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సి ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం ఆదారాలు సేకరించింది.









