Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : శిష్య స్కూల్లో ఘనంగా నేషనల్ సైన్స్ డే..!

మిర్యాలగూడలోని చైతన్య నగర్ లో ఉన్న శిష్య పాఠశాలలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు 100 రకాల ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. 150 చార్ట్ లను తయారుచేసి చక్కగా వివరించారు.

Miryalaguda : శిష్య స్కూల్లో ఘనంగా నేషనల్ సైన్స్ డే..!

మన సాక్షి, మిర్యాలగూడ :

మిర్యాలగూడలోని చైతన్య నగర్ లో ఉన్న శిష్య పాఠశాలలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు 100 రకాల ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. 150 చార్ట్ లను తయారుచేసి చక్కగా వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష మాట్లాడుతూ సివి రామన్ గురించి వివరించారు. ప్రతి విద్యార్థి సైన్స్ లో రాణించాలని, నిజజీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేశారు. సైన్స్ లో ఎవరూ చేయలేని సాహసాలను సివి రామన్ కనుగొని నిరూపించారని, ప్రపంచ దేశాలలో భారత్ ను శక్తివంతంగా నిలిపే ప్రయోగాలను చేశారని అన్నారు. ప్రస్తుత కాలంలో మూఢనమ్మకాలను విస్మరించి సైన్స్ పరంగా ఆలోచించాలని విద్యార్థులను కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు