Miryalaguda : క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ, డిఎ ప్రకటించాలి..!
Miryalaguda : క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ, డిఎ ప్రకటించాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లోఉన్న ఉద్యోగ, ఉపాద్యాయుల పీఆర్సీ, డిఎ విషయమై ఈనెల 20న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటన చేయాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ కోరారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ 2022 సంవత్సరం నుండి డిఎ లు రావాల్సి వున్నాయని, 2023 జూన్ నుండి నూతన పీఆర్సీ ప్రకటించవలసి వున్నదని చెప్పారు.
ఉద్యోగ, ఉపాద్యాయులు ప్రతి క్యాబినెట్ సమావేశంలో డిఎ, పీఆర్సీ గురించి నిర్ణయం తీసుకుంటారని ఆశతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఐదు డిఎలు పెండింగ్ లో వున్నాయని ప్రస్తుత క్యాబినెట్ సమావేశంలోనే వాటి విషయమై ప్రకటన చేయాలని సూచించారు. సమావేశంలో రమేష్, సైదా, జమ్ల,శ్రీను, లక్ష్మణ్,లాలు, మోతీలాల్, నెహ్రూ, మక్ల నాయక్, పాండు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!
Miryalaguda : ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలి.. లేదంటే చర్యలు..!









