జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : ఎస్.వి మోడల్ హై స్కూల్‌లో వైభవంగా కల్చరల్, గ్రాడ్యుయేషన్ డే..!

మిర్యాలగూడ లోని వాసవి నగర్‌లోని ఎస్.వి మోడల్ హై స్కూల్ లో కల్చరల్, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

Miryalaguda : ఎస్.వి మోడల్ హై స్కూల్‌లో వైభవంగా కల్చరల్, గ్రాడ్యుయేషన్ డే..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ లోని వాసవి నగర్‌లోని ఎస్.వి మోడల్ హై స్కూల్ లో కల్చరల్, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్, డైరెక్టర్ విశాలక్ష్మీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా యుకెజి విద్యార్థులు తమ ప్రీ–ప్రైమరీ విద్యను విజయవంతంగా పూర్తిచేసుకొని ప్రైమరీ విద్యలోకి అడుగుపెడుతూ, అలాగే 5వ తరగతి విద్యార్థులు ప్రైమరీ విద్యను పూర్తిచేసుకొని హయ్యర్ ఎడ్యుకేషన్‌లోకి ప్రవేశిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని గ్రాడ్యుయేషన్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్స్, క్యాప్స్ ధరించి స్టేజ్‌పై సర్టిఫికెట్లు స్వీకరించే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ప్రదర్శించిన అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను మంత్ర ముగ్ధులను చేసి, కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి సుమారు 500 మంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఆహ్వానితులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

అదేవిధంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ – టెక్నో (ఐఐటి– జె ఈఈ, నీట్ ఫౌండేషన్) కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా కంప్లీషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ మరియు విలువలను అలవర్చుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు