Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda: మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్.. తక్కువ ధరకు ధాన్యం దోపిడీ..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రైస్ మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి రైతుల వద్ద తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

Miryalaguda: మిర్యాలగూడలో మిల్లర్ల సిండికేట్.. తక్కువ ధరకు ధాన్యం దోపిడీ..!

ఏపీ ధాన్యం రాకుండా సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి

ఐకెపి కేంద్రాలు వెంటనే తెరవాలి

మాజీ మార్కెట్ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రైస్ మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి రైతుల వద్ద తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని పలు రైస్ మిల్లులను మాజీ మార్కెట్ చైర్మన్, రైతుబంధు మాజీ జిల్లా అధ్యక్షుడు చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ALSO READమంత్రి వివేక్ కు షాక్.. క్యాతనపల్లి మున్సిపల్ పీఠంపై బీఆర్ఎస్..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి ధాన్యం ప్రారంభమైన మొదటి రోజుల్లో క్వింటాలకు 2,750 ధరలు ఇచ్చిన వ్యాపారులు మూడు రోజులుగా సిండికేట్ గా ఏర్పడి 2400 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం ఇక్కడ మిల్లులకు వస్తున్నందున ప్రభుత్వం సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నియంత్రించాలని కోరారు.

కె ఎన్ ఎం, మహేంద్ర చింటూ రకాలను కొందరు మిల్లర్లు మాత్రమే కొనుగోలు చేస్తూ క్వింటాలుకు 2100 మాత్రమే ధర చెల్లిస్తున్నారని, రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. గత ఏడాది యాసంగి బోనస్ ఇంతవరకు రైతులకు చెల్లించలేదని, ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి కేంద్రాల వెంటనే తెరిచి ధాన్యం కొనుగోలు ప్రారంభించి రైతులకు బోనస్ ఇవ్వాలని కోరారు.

రైతులతో మాట్లాడుతున్న చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ALSO READTG News : గజ్వేల్ లో హై టెన్షన్.. కేసీఆర్ ఆఫీస్ పై దాడి, హరీష్ రావు ఫైర్..!

రైతులు వారం రోజులుగా ఆందోళన చెందుతున్నా.. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు మిల్లుల వద్దకు కనీసం వెళ్లకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే రెవిన్యూ పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాలన్నారు.

పెట్టుబడి వ్యయం బాగా పెరిగినందున కనీసం క్వింటాలకు రూ.3000 గిట్టుబాటు ధర అందించేలా చూడాలని కోరారు. ఆయన వెంట మండల బారాస అధ్యక్షుడు మట్టపల్లి సైదయ్య, సర్పంచులు ప్రసాద్, సాగర్ నాయక్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రైతులు మధుసూదన్, నాగేశ్వరరావు, వెంకన్న తదితరులు ఉన్నారు.

ఈ వార్తలు చదవండి : 

మరిన్ని వార్తలు