Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా రెండో విడత ముహూర్తం ఫిక్స్.. ఎన్ని ఎకరాల కంటే..!

తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తున్న విషయం తెలిసింద మార్చి 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేసింది.

Rythu Bharosa : రైతు భరోసా రెండో విడత ముహూర్తం ఫిక్స్.. ఎన్ని ఎకరాల కంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తున్న విషయం తెలిసింద మార్చి 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల మందికి రైతులకు ఎకరం చొప్పున 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరి కొత్త రీతిలో ప్రతి రైతుకు మొదటి విడత రైతు భరోసా అందే విధంగా చర్యలు చేపట్టింది. కాగా అందుకు 3590 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

ఇదిలా ఉండగా రెండవ విడత రైతు భరోసా నిధులు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అందుకు గాను 2650 కోట్ల రూపాయలను సమకూర్చాలని ఆదేశించారు. రైతు భరోసా రెండవ విడత నిధులను ఏప్రిల్ రెండవ వారంలో రైతుల ఖాతాలలో జమ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టనున్నది. రెండవ విడతలో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఖాతాలలో జమ చేయనున్నారు.?రైతు భరోసా కోసం 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు చర్యలు చేపట్టనుంది.

MOST READ 

మరిన్ని వార్తలు