Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Breaking : బొమ్మకల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..!

కరీంనగర్ నగరం బొమ్మకల్ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Breaking : బొమ్మకల్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ నగరం బొమ్మకల్ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే తీగల వంతెన వైపు నుండి అతివేగంతో వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు (నెం.టీ. ఎస్ 02 ఇ 3223), బొమ్మకల్ శివారులోని సమీర్ దాబా ముందు పార్క్ చేసి ఉన్న లారీని (వా.నెం. బీర్ 21 జీడీ 2168) వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.

కారు అతివేగంగా ఉండటంతో లారీ కిందకు దూసుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులు సయ్యద్ అబ్దుల్ రెహమాన్ (19), కరీంనగర్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ (21), కరీంనగర్ (డ్రైవర్) లు మృతి చెందాగా మహమ్మద్ అద్నాన్ (18): తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రస్తుతం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహమ్మద్ అబ్రార్ (20): స్వల్ప గాయాలతో కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శుక్రవారం స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానిక రూరల్ ఏసీపీ విజయ కుమార్ మరియు రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి లను అడిగి తెలుసుకున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

మరిన్ని వార్తలు