Miryalaguda : ఎస్వి మోడల్ స్కూల్లో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు..!
Miryalaguda : ఎస్వి మోడల్ స్కూల్లో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్ లోని ఎస్ వి మోడల్ హై స్కూల్ లో స్నాతకోత్సవ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఐఐటీ , నీట్ ఫౌండేషన్ సర్టిఫికెట్స్, స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ మాట్లాడుతూ పాఠశాలలో ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తామని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ప్లే మెథడ్ ద్వారా విద్యాబోధన ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ పాఠ్యప్రణాళిక, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఐఐటీ, నీట్ ఫౌండేషన్ ఇస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్నారు.
పదో తరగతి ఫలితాలు ప్రతి సంవత్సరం 100% ఉంటాయని ఈ విజయానికి సహకరిస్తున్నటువంటి పేరెంట్స్ కి, ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి, ఇన్చార్జి నాగలక్ష్మిలతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
MOST READ :










