తెలంగాణBreaking Newsజిల్లా వార్తలు
Miryalaguda : ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మిర్యాలగూడ యువకుడు..!
Miryalaguda : ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మిర్యాలగూడ యువకుడు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఒకటి సాధించడమే ఎంతో టాలెంట్ ఉండాలి. అలాంటి పరిస్థితులలో ఒకే సంవత్సరంలో 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తన టాలెంట్ నిరూపించుకున్నాడు మిర్యాలగూడ యువకుడు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జాలుబావి తండా చెందిన భూక్య సేవా రాథోడ్ ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగంలో 8వ ర్యాంకు సాధించాడు. దాంతోపాటు ఎస్జీటీ ఉద్యోగం కూడా సాధించాడు.
గతంలో గురుకుల జూనియర్ లెక్చరర్, పిజిటి, అదే విధంగా తెలంగాణ టిజిఎస్పి లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు. ఒకే సంవత్సరంలో 5 ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :









