Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

BREAKING : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ పై కీలక ఆధారాలు సేకరణ..!

BREAKING : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ పై కీలక ఆధారాలు సేకరణ..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :.

కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసు పై కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది. పటాన్ చెరు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. లాస్య కారు ముందుగా టిప్పర్ లారీని ఢీ కొట్టినట్లు గుర్తించారు. కాగా లాస్య కారు ఢీ కొట్టిన టిప్పర్ లారీని పోలీసులు సీజ్ చేశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.

కాగా డ్రైవర్ ను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజుల క్రితం ఫిబ్రవరి 23వ తేదీన శుక్రవారం తెల్లవారుజామున లాస్య నందిత కారు పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఆమె మరణించింది. ఆమె కారు అదుపుతప్పి లారీ ని ఢీ కొట్టి రైలింగ్ ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

కారు నడిపిన ఆకాష్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆకాష్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పటాన్ చెరు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆకాశ్ నిద్రమత్తులో కారు నడిపినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కాగా లాస్య నందిత కారుకు ఢీ కొట్టిన టిప్పర్ లారీ దొరకడంతో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ALSO READ : Telangana : కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి కెసిఆర్ కు సంచలన లేఖ..!

మరిన్ని వార్తలు