తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డిరాజకీయం

Indiramma Indlu : లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…!

Indiramma Indlu : లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…!

రాజేంద్రనగర్, మనసాక్షి :

రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం అనేక అనేక పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్
మున్సిపాలిటీ పరిధిలో మంజూరు అయిన 524 ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి పేదల కష్టసుఖాలు తెలిసినవారని వారికి అవసరమైన అన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వ పథకాలను అందుకున్న వారు వాటిని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. పేద ప్రజల ఇంటి నిర్మాణానికి రూ 500000 ఉచితంగా ఇవ్వడం చరిత్రలోనే మొదటిసారి అని వాటిని ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని వారికి సహకరించి అన్ని వార్డులను అభివృద్ధి చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నాయకులకు ఆయన సూచించారు.

పనిచేస్తున్న అధికారులను తప్పు పట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఇందిరమ్మ గృహాలు రానివారు ఇంకా ఎవరైనా ఉంటే రాబోయే రోజుల్లో  దరఖాస్తు చేసుకోవాలని  వారందరికీ మంజూరు అయ్యేలా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ నేతలు,తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  2. Madgulapally : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య..!

  3. TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  5. Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!

మరిన్ని వార్తలు