Miryalaguda : మత కలహాలు లేపే ఉగ్రవాద మూకలకు ఎమ్మెల్యే హెచ్చరికలు..!
Miryalaguda : మత కలహాలు లేపే ఉగ్రవాద మూకలకు ఎమ్మెల్యే హెచ్చరికలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
జమ్ము కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా, మృతి చెందిన భారతీయులకు నివాళులు అర్పిస్తూ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం వరకు భారీగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ఒక్క పిలుపుతో మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల వారు స్వచ్ఛంగా పాల్గొని భారత దేశంలో బిన్నతవంలో ఏకత్వంగా మేమంతా ఒక్కటే అని సోదర భావాన్ని తెలియజేశారని అన్నారు. మిర్యాలగూడ నుంచి మతాల పేరుతో మనమధ్యలో అల్లర్లు రేపుతున్న ఉగ్రవాద మూకలకు హెచ్చరికలు పంపామని అని అన్నారు.
ఇదేవిధంగా మన దేశానికి , మన రాష్టానికి, మన నియోజకవర్గానికి ఏ సమస్య వచ్చినా అందరం ఏకమై కదిలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ , డీఎస్పీ రాజశేఖర్ రాజు , తహసిల్దార్ హరిబాబు, మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్,
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యమ సంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు, లయన్స్ క్లబ్ , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ , వాసవి క్లబ్, ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపారస్థులు , విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.. జిల్లా కలెక్టర్ ను వేడుకున్న నిరుపేద..!
-
District collector : ప్రతి రైతుకు ఆధార్ తరహాలో భూధర్ కార్డు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!
-
District Collector : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అకౌంట్ లో బిల్లులు జమ.. జిల్లా కలెక్టర్..!
-
Video call : రిటైర్డ్ ఉద్యోగినికి వీడియో కాల్.. రూ. 30 లక్షలు కొట్టేశారు..!










