క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్
Video call : రిటైర్డ్ ఉద్యోగినికి వీడియో కాల్.. రూ. 30 లక్షలు కొట్టేశారు..!
Video call : రిటైర్డ్ ఉద్యోగినికి వీడియో కాల్.. రూ. 30 లక్షలు కొట్టేశారు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఓ రిటైర్డ్ ఉద్యోగినికి సైబర్ కేటుగాళ్లు వీడియో కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బు ఇవ్వకుంటే కుమారులను చంపేస్తామని బెదిరించారు. వీడియో కాల్ తో భయపడి ఆన్‌లైన్ ద్వారా నగదును ఆమె బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సైబర్ మోసగాళ్లు ఈ చర్యకు పాల్పడ్డారు. కొత్తపేటలోని ఓ విశ్రాంతి ఉద్యోగినిని బెదిరించి ఆమె నుంచి భారీ మొత్తం కాజేశారు. కేటుగాళ్లు ఆమెకు సిబిఐ అధికారుల మంటూ వీడియో కాల్ చేసి బెదిరించారు.
30 లక్షల నగదును బ్యాంకులో జమ చేయాలని లేదంటే కుమారులను చంపేస్తామని బెదిరించారు. దాంతో భయపడి ఆన్‌లైన్ ద్వారా 30 లక్షల రూపాయలను బదిలీ చేశారు. ఆ తర్వాత అది మోసమని గ్రహించిన బాధితురాలు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Cyber : సైబర్ మోసగాడికే చుక్కలు చూపించిన యువకుడు.. ఎలాగో అందరూ తెలుసుకోండి..!
-
Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)
-
Viral Video : డబ్బులు ఊరికే రావు.. బ్యాంకు మేనేజర్ ను పిచ్చి కొట్టుడు కొట్టిన కస్టమర్..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!









