Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Mlc poling : రేపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు..!

Mlc poling : రేపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు..!

నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయనికి బుధవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీసు అధికారులు చేరుకొని బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

 

అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 80 మంది లోకల్ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలచే పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామనిఎస్పీ తెలిపారు.

 

పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరు గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం చుట్టూ బారికెడ్స్ ఏర్పాటు, క్యూ లైన్స్ ఏర్పాటు, ట్రాఫిక్ డైవర్షన్ తదితర ఏర్పాట్లను చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్ లింగయ్య, ఎస్ బి సిఐ రామ్ లాల్, సిఐ శివ శంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : KTR : ముఖ్యమంత్రా.. బోటి కొట్టేవాడా, రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్..!

మరిన్ని వార్తలు