Indiramma Atmiya Bharosa : రైతు కూలీల ఖాతాలలో డబ్బులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. లేటెస్ట్ అప్డేట్..!

Indiramma Atmiya Bharosa : రైతు కూలీల ఖాతాలలో డబ్బులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇటీవల రైతు భరోసా పథకం ద్వారా రైతులకు బ్యాంకు ఖాతాలలో తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రూపాయలు జమ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలను ఖాతాలలో జమ చేసే ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతు కూలీలకు ఆర్థిక సహాయం అందజేయడానికి ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది.
ఇప్పటికే రైతు కూలీలను ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. దారిద్ర రేఖకు దిగువన ఉన్న ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉండి కనీసం 20 రోజులు పని దినాలలో పనికి వెళ్ళిన వారు, భూమిలేని కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 83,887 మంది రైతు కూలీలకు ఆర్థిక సహాయం అందజేసింది. ఇదిలా ఉండగా మిగిలిన రైతులకు రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ బారోసాను అందజేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుకుగాను 261 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుదగా మరో నాలుగు లక్షల 35 వేల 304 మంది రైతు కూలీలకు నేరుగా వారి ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నది. జూలై మొదటి వారంలో తొలి విడతగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అందజేయనున్నది. రైతు కూలీలకు వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ వార్తలు కూడా చదవండి :
-
Gold Price : దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Annadata Sukhibhava : రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Bank Holidays : జూలైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. లిస్ట్ ఇదే..!
-
Suryapet : సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ ఎవరో తెలుసా..!
-
Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!









