SURYAPET : మహిళ ఉద్యోగస్తులను వీడియో కాల్ చేయాలంటూ ఎంపిడిఓ ఒత్తిడి.. ఉద్యోగస్తులు నిరసన..!
SURYAPET : మహిళ ఉద్యోగస్తులను వీడియో కాల్ చేయాలంటూ ఎంపిడిఓ ఒత్తిడి.. ఉద్యోగస్తులు నిరసన..!
అర్వపల్లి, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల అభివృద్ధి అధికారిగా మూడు నెలల క్రితం వచ్చిన టి పవన్ కుమార్ చేస్తున్న చేష్టలు ప్రవర్తన తో విసిగిపోయి సామూహిక సెలవులు పెట్టడానికి సిద్ధమైన ఉద్యోగస్తులు. మూడు నెలల క్రితం పాలకీడు మండలం నుండి ఇక్కడికి వచ్చిన మండల అభివృద్ధి అధికారి పై ఉపాధి హామీ, పంచాయతీ ఆపరేటర్లు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ జూనియర్ అధికారులు అందరూ కూడా ఆయన ప్రవర్తనతో విసిగి వేసారి సామూహిక సెలవులు పెట్టడానికి సిద్ధపడి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ సమస్యలను పై అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
మహిళ ఉద్యోగస్తులను వీడియో కాల్ చేయాలంటూ ఒత్తిడి చేయడం అందరి ముందు హేలనగామాట్లాడడం, చులకన చేసి మాట్లాడడం చేస్తున్నట్లుఆరోపించారు. ఎవరు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ప్రజలకు అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు అందుబాటులో లేకుండా ఉండడం, అధికారులను మానసికంగా వేధిస్తున్నట్లు అనిపించారు. దయచేసి మండల అభివృద్ధి అధికారిని కలెక్టర్ ఆఫీసుకు సరెండర్ చేయాలని, బదిలీ చేయాలని ఉద్యోగస్తులు నిరసనతో తెలియజేస్తున్నారు.
మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఇలాంటి సంఘటన మండల పరిధిలో జరగడం ఇదే మొదటిసారి, అర్వపల్లి మండలం ప్రశాంతతకు మారుపేరు, ఎంపీడీవో కార్యాలయం కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయ అధికారి కూడా మండలానికి వచ్చిన తర్వాత బదిలీపై పోయేటప్పుడు చాలా బాధతో వెళుతున్నట్లు ,ప్రజల ఆప్యాయతను మండలాన్ని, స్మరించుకుంటూ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఈ అధికారి మాకొద్దు అంటూ ఉద్యోగస్తులు ప్రజలు మూకుమ్మడిగా మొరపెట్టుకున్న సంఘటన ఇదే ప్రథమం.
(Reporting : Uppalaiah, ManaSakshi, Arvapalli)
LATEST UPDATE :
-
BREAKING : ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మోసం.. కోట్ల రూపాయలతో జెండా ఎత్తిన సంస్థ..!
-
Hyderabad : కూకట్ పల్లి లో రోడ్లపై వ్యభిచారుల గుర్తింపు.. తహసిల్దార్ వద్ద బైండోవర్..!
-
Diwali : దీపావళి పండుగ ఎప్పుడు..? ఎన్ని రోజులు సెలవులు..!
-
District collector : విద్యార్థులకు వసతి గృహాన్ని సిద్ధం చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Suryapet : అభివృద్ధి, మెరుగైన జీవితాల కోసం.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపు..!









