Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని హత్య..!

Nalgonda : నల్గొండలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని హత్య..!

నల్లగొండ, మనసాక్షి :

జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ప్రేమ పేరుతో దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం స్థానిక డైట్ కళాశాల సమీపంలో చోటుచేసుకుంది.

పోలీసులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఓ బాలిక (17) కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఈ సమయంలోనే గుట్ట కింద అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ గౌడ్ అనే ట్రాక్టర్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.

సుమారు ఆరు నెలలుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ బాలికను గడ్డం కృష్ణ మిత్రుడైన ఓ ఆటో డ్రైవర్ రూమ్ లోకి తీసుకెళ్లగా రూమ్ లో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా గడ్డం కృష్ణ విద్యార్థిని హత్య చేసి డైట్ కళాశాల సమీపంలో పడేసినట్లు తెలిపారు.

బాలికపై లైంగిక దాడి జరిపి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా సంఘటన స్థలాన్ని నల్లగొండ డిఎస్పి శివరామిరెడ్డి వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

MOST READ : 

  1. Rain : వర్షంలో తడిస్తే జ్వరం ఎందుకు వస్తుంది.. నిజాలు ఇవే..!

  2. Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!

  3. Alumni : ముప్పై ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం.. అవదుల్లేని ఆనందం..!

  4. TG News : ప్రయాణికులకు భారీ షాక్.. బస్ చార్జీల పెంపు..!

  5. Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు