Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Alumni : ముప్పై ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం.. అవదుల్లేని ఆనందం..!

Alumni : ముప్పై ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం.. అవదుల్లేని ఆనందం..!

శాలిగౌరారం, మనసాక్షి :

శాలిగౌరారం మండలం మాదవరం కలాన్ ఉన్నత పాఠశాల 1994–95 బ్యాచ్ పూర్వవిద్యార్థులు ముప్పై సంవత్సరాల తరువాత కొండారం లో ఒక ఫంక్షన్ హల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్బంగా పాఠశాల దినాలు, గురువులు, స్నేహితులు మన హృదయంలో మరపురాని గుర్తులుగా నిలిచిపోయాయని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం మనలోని పాత స్నేహాలకు మళ్లీ ప్రాణం పోసిందని నిన్నటి ఆటలు, నవ్వులు, పాఠాలు, శిక్షలు ఇవన్నీ మళ్లీ మన కళ్లముందు నాట్యం చేస్తున్నాయి అన్నారు.

ఈ ఆనందానికి కారణమైన ప్రతి ఒక్కరికి గురువులకీ, నిర్వాహకులకీ, పూర్వవిద్యార్థులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా చిన్ననాడు విద్యా బుద్దులు నేర్పిన గురువులను సన్మానించుకున్నారు. అనంతరం అట పాటలతో సందడిగా గడిపారు.

ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు వీరయ్య, అశోక్ రెడ్డి, నర్సింహా రెడ్డి, వెంకట్ రెడ్డి పూర్వ విద్యార్థులు కుంభం జానయ్య, రంగు బిక్షం, అన్నేబోయిన సైదులు, కప్పల రమేష్, రంగు జానయ్య శ్రీనివాస్, వెంకన్న, లింగయ్య, తిరుమల్ రెడ్డి, ఉమారాని, సైదమ్మ, గంగదారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Meals : అరటి ఆకులో భోజనం.. దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు, మీకు తెలుసా..!

  2. BIG BREAKING : టుడే టాప్ న్యూస్.. 04-10-2025..!

  3. Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!

  4. Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!

  5. Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!

మరిన్ని వార్తలు