Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

Madgulapally : మతసామరస్యానికి ప్రతీక.. వేలంపాటలో గణపతి లడ్డు కైవసం చేసుకున్న ముస్లిం మహిళ..!

Madgulapally : మతసామరస్యానికి ప్రతీక.. వేలంపాటలో గణపతి లడ్డు కైవసం చేసుకున్న ముస్లిం మహిళ..!

మాడుగులపల్లి, మన సాక్షి :

వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మాడుగులపల్లి మండలంలోని ఆగమోత్కూర్ గ్రామంలో మహాసేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన శనివారం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా లడ్డు వేలం పాట కార్యక్రమంలో స్థానిక ముస్లిం మహిళ ఆగా షకీరా బాను కుల మతాలకు అతీతంగా మత సామరస్యం వెల్లివిరిసే విధంగా లడ్డు వేలం పాటలో పాల్గొని 25,116 రూపాయలు లడ్డును కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అండెం యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రమదగణాలుకు అధిపతి అయిన వినాయకుని పూజించుకోవడం వల్ల మనం చేసే అన్ని పనులలో విజ్ఞాలన్ని తొలగిపోయి ఆ వినాయకుడి ఆశీస్సులతో, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఆదర్శ ప్రాయంగా గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి పండుగను ఎలాంటి వివాదాలు లేకుండా మతసామరస్యంతో మనమందరము జరుపుకోవాలని కోరారు. కుల మతాలకు అతితగా ముందుకు వచ్చి వినాయకుని దగ్గర లడ్డు కైవసం చేసుకున్న ఆగా షకీరా భానుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పల్ల హనుమంతు గౌడు,భూపతి శ్రీకాంత్ గౌడ్,భూపతి శ్రీను గౌడ్,బోల్లెపల్లి రాజు గౌడ్, అండెం సదానందం గౌడ్, తదితరుల ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు శోభయాత్రలో పాల్గొన్నారు.

MOST READ : 

  1. Turmeric and honey : పసుపు, తేనెతో ఆయుర్వేద శక్తి ఉందా.. ఎలా వినియోగిస్తే ఆరోగ్యం.. తెలుసుకుందాం..! 

  2. Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!

  3. Hyderabad : హైదరాబాద్‌లో కొత్త పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభం..!

  4. Minister Komatireddy : దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..!

మరిన్ని వార్తలు