Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుహైదరాబాద్

Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!

Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!

హైదరాబాద్, మన సాక్షి :

ఏడాది గణేష్ ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. హైదరాబాదులోని బండ్లగూడ రిచ్మండ్ విల్లాస్ లో గణేష్ మండపం వద్ద నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డు వేలం పాట నిర్వహించగా అత్యధికంగా 2.31 కోట్ల రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నారు.

అదే విధంగా బాలాపూర్ లడ్డు 35 లక్షలకు వేలంపాటలో భక్తుడు దక్కించుకున్నాడు. గత ఏడాది రికార్డును బ్రేక్ చేసింది. గత ఏడాది రూ. 30.01 లక్షల లడ్డు ధర పలకగా.. ఈ ఏడాది 35 లక్షలతో రికార్డ్ బ్రేక్ చేసింది. కర్మాన్ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ బాలాపూర్ లడ్డూను దక్కించు కున్నారు.

బాలాపూర్ లో తొలిసారిగా 1994లో లడ్డూ వేలం పాట నిర్వహించగా 450 రూపాయలతో లడ్డూ వేలం పాట మొదలైంది. ఈసారి 38 మంది వేలపాటలో పాల్గొనగా దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు.

భారీగా తరలివచ్చిన భక్తులు :

హైదరాబాదులోని ట్యాంక్ బండ్ భక్తులతో కిటకిటలాడింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా గణేష్ విగ్రహాలన్నీ ట్యాంక్ బండ్ మీదికి తరలి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలు తిలకించారు. ఖైరతాబాద్ అతిపెద్ద మహా గణపతి గంగమ్మ వాడికి చేరింది. ఖైరతాబాద్ నుంచి నేరుగా ట్యాంక్ బండ్ మీదికి చేరిన మహాగణపతి మధ్యాహ్నం రెండు గంటలకు క్రేన్ నెంబర్ 4 సహాయంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం పూర్తి చేశారు.

హైదరాబాదు నుండి ట్యాంక్ బండ్ పై నిమజ్జన వీడియో

MOST READ : 

  1. Miryalaguda : గణేష్ నిమజ్జనంలో అపశృతి.. సాగర్ ఎడమ కాలువలో తండ్రి, కొడుకులు గల్లంతు..!

  2. Hyderabad : హైదరాబాద్‌లో కొత్త పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభం..!

  3. ACB : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా మత్స్యశాఖ అధికారిని..!

  4. Rusk : రస్క్‌లు తింటున్నారా.. ఏమవుతుందో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు