తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజన్న సిరిసిల్ల జిల్లా

TG News : మా అమ్మకు నచ్చనిది.. నానమ్మ, తాతయ్య.. ఓ విద్యార్థి సమాధానం..!

TG News : మా అమ్మకు నచ్చనిది.. నానమ్మ, తాతయ్య.. ఓ విద్యార్థి సమాధానం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

మానవత్వం రోజురోజుకు మంట కలిసి పోతుంది. మనిషనేవాడు స్వార్థంతో నిండిపోయాడు. నాలుగో తరగతి చదివే చిన్నారి పరీక్షలో వచ్చిన ప్రశ్నకు రాసిన సమాధానం చూస్తే సమాజం ఎటు పోతుంది అనేది అర్థమవుతుంది.

వివరాల ప్రకారం.. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లో ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వార్షిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఆంగ్ల ప్రశ్నాపత్రంలో అమ్మకు నచ్చేవి.. నచ్చనివి ఏంటి అని ఒక ప్రశ్న అడిగారు. దాంతో ఆ విద్యార్థి రాసిన సమాధానం చూస్తే ఉపాధ్యాయుడికి ఆశ్చర్యం కలిగింది.

ఆ విద్యార్థి అమ్మకు నచ్చనిది నానమ్మ, తాతయ్య అని ఆంగ్లంలో రాయడం ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. ప్రస్తుత సమాజంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు, అత్తమామలు భారంగా మారారని వారి పట్ల ప్రేమ ఎలా ఉంటుందో ఆ విద్యార్థి సమాధానం ద్వారా అర్థమవుతుంది. మానవ సంబంధాలు, బంధాలు తెగిపోతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చును.

MOST READ : 

  1. BOI: ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించుకున్న బీఓఐ..!

  2. Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!

  3. Miryalaguda : గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం.. మిర్యాలగూడ సిరిమువ్వ నాట్యలయ చిన్నారులు..!

  4. Summer Tips: ఎండాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన డ్రింక్స్ ఇవే..!

  5. Rice : అన్నం ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.!

మరిన్ని వార్తలు