TOP STORIESBreaking Newsతెలంగాణనల్గొండ

Nagarjunasagar : నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద.. 511 అడుగులకు చేరిన నీటిమట్టం.. Latest Update

Nagarjunasagar : నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద.. 511 అడుగులకు చేరిన నీటిమట్టం.. Latest Update

మనసాక్షి, నాగార్జునసాగర్ :

మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలతో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది ఉప్పొంగుతోంది. నాగార్జునసాగర్ జలాశయం ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకలతో నిండుకుండలా ఉన్నాయి. దాంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 4.36 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదనకు గాను 62 వేల 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా నాగార్జునసాగర్ జలాశయానికి 54,438 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. 6744 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.

నాగార్జునసాగర్ జలాశయంలో మెల్ల మెల్లగా పెరుగుతుంది. సాగర్ జలాశ నీటిమట్టం నిల్వ సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511 అడుగుల నీరు ఉంది. 312 టీఎంసీల నీటికి గాను 134 టీఎంసీల నీరు ఉన్నది.

శ్రీశైలం గేట్లు ఎత్తితే భారీ వరద :

శ్రీశైలంకు 4.36 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా మంగళవారం గేట్లు ఎత్తనున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తితే నాగార్జునసాగర్ కు భారీ వరద వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది నాగార్జునసాగర్ లో నీరు లేక వెలవెల పోయింది. ఆయకట్టు భూములను బీళ్లుగా మారాయి. కాగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో సాగర్ జలాశయం వరకు వరద నీరు చేరింది. దాంతో రైతులు ఆనందంలో ఉన్నారు. సాగు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : 

Srisailam : శ్రీశైలంకు 4.36 లక్షల క్యూసెక్కుల వరద, నిండుకుండలా జలాశయం.. రేపు గేట్లు ఎత్తనున్న మంత్రి రామానాయుడు..!

30న రెండో విడత రుణమాఫీ..!

క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!

రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!

మరిన్ని వార్తలు