Nalgonda : నల్గొండ జిల్లా దామరచర్ల లో దొంగల బీభత్సం.. బంగారం షాపు కొల్లగొట్టారు..!
Nalgonda : నల్గొండ జిల్లా దామరచర్ల లో దొంగల బీభత్సం.. బంగారం షాపు కొల్లగొట్టారు..!
దామరచర్ల, మన సాక్షి :
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ నందు గల శ్రీ విజయ జ్యువెలరీ షాప్ లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు స్థానికులు చూసి షాప్ యజమాని బ్రహ్మయ్యకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బ్రహ్మయ్య షాప్ దగ్గరకు వచ్చి చూడగా షట్టర్ పగలగొట్టి బంగారు ఆభరణాలు మరియు వెండి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి ఆధారాలు సేకరించి ముప్పై తులాల వెండి పోయినట్టు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా గత కొన్ని నెలల క్రితమే ఎస్బిఐ ఏటీఎం నందు పెద్ద మొత్తంలో నగదు దొంగతనం జరిగింది. మరియు గ్రామంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లలో కూడా అక్కడక్కడ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా పోలీసులు భద్రత పెంచి ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.









