Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంవ్యవసాయం

Rythu : రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. ఇకపై వారికి కూడా ఖాతాలలో డబ్బులు..!

Rythu : రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. ఇకపై వారికి కూడా ఖాతాలలో డబ్బులు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 19 విడతలుగా ప్రభుత్వం సహాయం అందజేసింది. అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి మూడు విడతలుగా 6000 రూపాయలను వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది.

అయితే చిన్న చిన్న కారణాలతో చాలామంది రైతులకు పిఎం కిసాన్ డబ్బులు ఖాతాలలో జమ కావడం లేదు. ఈ కారణాలను వ్యవసాయ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఇలా ఎంతో మంది రైతులు ఈ పథకం లబ్ధి పొందడం లేదు.

దాంతో కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలనే కీలక నిర్ణయం తీసుకుంది. కచ్చితంగా ప్రతి రైతు 20వ విడత పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. అదేవిధంగా పిఎం కిసాన్ డబ్బులు పడటం లేని రైతులు నేరుగా నోడల్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చును.

నోడల్ అధికారికి మొబైల్ నెంబర్ రూపంలో కూడా అధికారికి ఫిర్యాదు చేయవచ్చును. అయితే చాలామందికి నోడల్ అధికారి మొబైల్ నెంబర్ తెలియకపోవడంతో పాటు ఎవరికీ ఫిర్యాదు చేయాలని విషయం తెలియక ఆ నిధులు పొందలేకపోతున్నారు.

ఎలా అంటే..

ముందుగా పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం అధికారిక వెబ్సైట్ www.pmkisan.gov.in ఓపెన్ చేయాలి. అనంతరం ఫార్మర్ కార్నర్ కి వెళ్ళాలి. సెర్చ్ యువర్ పాయింట్ కాంటాక్ట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ రాష్ట్ర నోడల్ అధికారులు, జిల్లా నోడల్ అధికారుల గురించి సమాచారం ఉంటుంది తెలుసుకోవచ్చును.

ఇప్పటి వరకు రైతులకు పిఎం కిసాన్ యోజన ద్వారా 19 విడుదల నగదు ఖాతాలలో జమయింది. ఇక 20వ విడత జూన్ 2025 లో విడుదల చేరినట్లు సమాచారం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

  1. Panchayat Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే.. మంత్రి పొంగులేటి క్లారిటీ.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Employees : ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం..!

  3. NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!

  4. Anganwadi Workers : అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం భారీ శుభవార్త..!

  5. Rythu : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఈరోజు సాయంత్రం లోగా ఖాతాలలో నగదు జమ..!

  6. Gold Price : పసిడి ప్రియులకు ఊహించని షాక్.. ఒక్కరోజే రూ. 27,300..!

మరిన్ని వార్తలు