తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : మూకుమ్మడి సెలవుల్లో వైద్యులు.. వైద్యం అందక మృత శిశువు జననం..!

Nalgonda : మూకుమ్మడి సెలవుల్లో వైద్యులు.. వైద్యం అందక మృత శిశువు జననం..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇటీవల
కుర్చీ పైనే మహిళ డెలివరీ సంఘటనపై కలెక్టర్ డ్యూటీ డాక్టర్ కు నర్సులకు సంజాయిషీ నోటీసు ఇవ్వడంతో మనస్థాపం చెందిన డాక్టర్లు నర్సులు విధులకు దూరంగా ఉండి నిరసన తెలుపుతూ మూకుమ్మడి సెలవుల్లో ఉన్నారు.

షో కాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విధులకు గైర్హాజరు కావడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు అనేక ఇబ్బందులు పడు తున్నారు. తాజాగా ఆదివారం జిల్లా ఆస్పత్రిలో సకాలంలో గర్భిణీకి వైద్యం అందక మృత శిశువుకు జన్మనిచ్చిన సంఘటన జరిగినది.

మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలత శనివారం అర్ధరాత్రి డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చి నిండు గర్భం తో నానా అవస్థలు పడింది. చివరకు హాస్పిటల్ నుండి బయట ఆసుపత్రికి వెళ్లాలని చూస్తే అక్కడి డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ ఆమెతో మాట్లాడి ఆమెని లోపలికి తీసుకెళ్లి పరీక్షలు చేయగా కడుపులో శిశువు హార్ట్ బీట్ తగ్గుతుంది అని వెంటనే సిజేరియన్ చేయగా అప్పటికే మృత శిశువు జన్మించినది.

అయితే సకాలంలో సిజేరియన్ ఆపరేషన్ చేస్తే శిశు బతికేదని వైద్యం ఆలస్యం కావడంతోనే మృత శిశువు జన్మించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ మూర్తి మాట్లాడుతూ ఆమెకు చాలా జ్వరం ఉంది పరిస్థితి విషమించింది అని, ఆసుపత్రిలో నిన్న మూకుమ్మడిగా వైద్యులు సెలవులు పెట్టి
విధులకు హాజరు కానీ విషయం వాస్తవమే. అలాగే అక్కడే డ్యూటీలో ఉన్న డాక్టర్ సదరు గర్భిణీ మహిళ కొంత అనారోగ్యంతో జ్వరంతో బాధపడుతుందని గ్రహించి వెంటనే పరీక్ష చేయగా శిశువు హార్ట్ పల్స్ రేటు పడిపోతుందని గుర్తించింది.

వెంటనే సిజేరియన్ చేయగా పాప అప్పటికే విష జ్వరం కారణంగా మృతి చెందినది. వైద్యులు విధులకు హాజరు కావాలని కోరినా ఇంత వరకు హాజరు కాలేదు. ఈ విషయమే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

LATEST UPDATE ; 

మిర్యాలగూడ : ఆ గ్రామంలో మూడు నెలలుగా గుడిసెలు, గడ్డివాములు దగ్ధం.. భయాందోళనలో గ్రామస్తులు, జెవివి సందర్శన..!

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

BIG BREAKING : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం..!

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

మరిన్ని వార్తలు