Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : ఆ గ్రామంలో మూడు నెలలుగా గుడిసెలు, గడ్డివాములు దగ్ధం.. భయాందోళనలో గ్రామస్తులు, జెవివి సందర్శన..!

మిర్యాలగూడ : ఆ గ్రామంలో మూడు నెలలుగా గుడిసెలు, గడ్డివాములు దగ్ధం.. భయాందోళనలో గ్రామస్తులు, జెవివి సందర్శన..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఓ గ్రామంలో వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మూడు నెలలుగా ఆ గ్రామంలో గుడిసెలు, గడ్డివాములు దగ్దమవుతున్నాయి. దాంతో ఆ గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. వివరాల ప్రకారం..

మిర్యాలగూడ మండలం కురియ తండా గ్రామంలో గత మూడు నెలలుగా గుడిసెలు, గడ్డివాములు దగ్ధమవుతున్నాయి. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనవిజ్ఞాన వేదిక, పౌర ప్రజాసంఘాల నాయకులు ఆదివారం ఆ గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ధనావత్ సూర్య, ఉప సర్పంచ్ ధనావత్ థావు తో మాట్లాడారు. గ్రామంలో మధ్యాహ్న సమయంలో ధనావత్ నంధ్యా, సోమ్లా గుడిసెలు, ధనావత్ విజయేందర్ 500 కట్టల గడ్డివాము కాలిపోయాయని వారు తెలిపారు.

అనంతరం జన విజ్ఞాన వేదిక పౌర ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ రాజు, కోల శ్రీనివాస్, కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు మంత్ర తంత్రాలను నమ్మి ఆర్ధికంగా, మానసికంగా నష్టపోకూడదని పేర్కొన్నారు. శాస్త్రీయంగా ఆలోచించి తగు నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు.

జె కొండల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కందుకూరి సుదర్శన్ మాట్లాడుతూ గ్రామంలో త్వరలో మూఢనమ్మకాల నిర్మూలనకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన ధనావత్ బలరాం, మహేష్, హరి, వాల్య, తేజ, బబ్రు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

HYDRA : హైడ్రా హడల్.. కూల్చేది 134 చెరువుల్లో అన్ని వేల నిర్మాణాలున్నయా..!

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

మరిన్ని వార్తలు