Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో పేదలకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నారు.
దాంతో పాటు ఆరోగ్యశ్రీ సేవలు పెంపు , గృహ విద్యుత్ 200 యూనిట్ల లోపు ఉన్న వినియోగించిన పేదలందరికీ ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నారు. అదే విధంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా ఇటీవలనే పూర్తి చేశారు. కాగా మరికొన్ని హామీలపై దృష్టి సారించారు.
అందులో భాగంగా ఇంతకాలం పేదలు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న సన్న బియ్యం పంపిణీకి తేది ఫిక్స్ చేసింది. సన్న బియ్యంతో పాటు అవసరమైన వారికి గోధుమలు కూడా పంపిణీ చేయడానికి నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన పేదలందరికీ 2025 జనవరి నుంచి సన్నరకం బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయం వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానంలో అత్యంత కీలకమైన అంశం సన్న బియ్యం పంపిణీ. సన్న బియ్యం తో పాటు అవసరమైన ప్రాంతాలలో రాయితీ కల్పించి గోధుమలు కూడా పంపిణీ చేయనున్నారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!
Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!









