Nalgonda : నల్గొండ జిల్లాలో నీటి కోసం రైతుల రాస్తారోకో..!
Nalgonda : నల్గొండ జిల్లాలో నీటి కోసం రైతుల రాస్తారోకో..!
మాడ్గులపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో తాగు, సాగునీటి కోసం రైతులు రాస్తారోకో చేశారు. నాగార్జునసాగర్ వరద కాలువకు నీటిని విడుదల చేయాలని అద్దంకి , నార్కట్ పల్లి రహదారిపై గురువారం మాడ్గులపల్లి మండలం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
సాగర్ జలాశయంలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ వరద కాలువకు నీటిని విడుదల చేయకపోవడం వల్ల రైతులు సాగు తాగునీటికి అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.
వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం కుక్కడం సమీపంలో అద్దంకి , నార్కట్ పల్లి రహదారిపై నాగార్జునసాగర్ వరద కాలువకు నీటిని విడుదల చేయాలని ఎనిమిది గ్రామాల రైతులు రాస్తారోకో నిర్వహించారు. దాంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాస్తారోకో చేస్తున్న రైతులను పోలీసులు పక్కకు జరిపి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న రైతులు మాట్లాడుతూ.. సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద కాలువకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. ఎనిమిది గ్రామాలలో సాగునీటితో పాటు తాగునీటికి కూడా కష్టాలు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు.
పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ నీటి విడుదల చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు వారి పేర్కొన్నారు. అధికారులు, మంత్రులు స్పందించి వెంటనే వరద కాలువకు నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని వారు డిమాండ్ చేశారు.
LATEST UPDATE :
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 16 గేట్లు ఎత్తిన అధికారులు..!
Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!
తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!










