Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIES

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

మనసాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలన సందర్భంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించారు. కాగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు. రేషన్ కార్డుల జారీ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1629 రేషన్ దుకాణాలలో డీలర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని త్వరలో భర్తీ చేయనున్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే రేషన్ డీలర్ల నియామకం కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. జనవరి నాటికి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టి పేదలను ఆదుకోనున్నది.

సన్నబియ్యం తో పాటు అవసరమైన చోట గోధుమలు కూడా పంపిణీ చేయనున్నారు. 2025 జనవరి నాటికి సన్న బియ్యం, గోధుమలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యే నాటికి రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నారు.

సివిల్ సప్లై అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ రేషన్ డీలర్లు ఖాళీలు ఉన్నవో గుర్తించి వాటిని భర్తీ చేయాలని ఆదేశించారు. ముందుగా ఆ ప్రక్రియను అధికారులు వేగవంతం చేయనున్నారు.

రేషన్ డీలర్ పోస్ట్ కు పదవ తరగతి విద్యా అర్హతతో పాటు ఖాళీగా ఉన్న రేషన్ షాపు స్థానికుడై ఉండాల్సి ఉంది. 18 సంవత్సరాలకు పైగా ఉన్న వ్యక్తికి అవకాశం కల్పించనున్నారు. సొంత గ్రామంలోనే ఉద్యోగం చేసే ఈ అవకాశాన్ని స్థానికులు  వినియోగించుకోవచ్చును. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొంటారు.

LATEST UPDATE : 

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

Revanth, Batti : పిసిసి చీఫ్ అతడే.. ఇక మంత్రులు కూడా ఖరారు.. ఢిల్లీకి చేరిన రేవంత్, భట్టి..!

మరిన్ని వార్తలు