Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

హైదరాబాద్ పర్యటనలో రాహుల్ గాంధీ.. వీటికి సమాధానం ఏది..? అంటూ కేటీఆర్ సూటి ప్రశ్నలు..!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన ఎక్స్ ఖాతాలో కేటీఆర్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

హైదరాబాద్ పర్యటనలో రాహుల్ గాంధీ.. వీటికి సమాధానం ఏది..? అంటూ కేటీఆర్ సూటి ప్రశ్నలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన ఎక్స్ ఖాతాలో కేటీఆర్ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అభయహస్తం లోని హామీల అమలు తీరు గురించి అడిగారు. తెలంగాణ ఖజానా ఖర్చుతో హైదరాబాదులో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీ లపై అడుగుతున్న సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ.. వివిధ కార్యక్రమాలకు హాజరు..!

బీసీ సంక్షేమానికి లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాల కాలంలో రూ.5000 కోట్ల కంటే తక్కువ నిధులే ఇచ్చారని ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక శాతం కూడా అమలు చేయలేదని విమర్శించారు. పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు అందిస్తామని, అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఎస్సీ, ఎస్టీలకు 31 శాతం వాటా కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలులో సున్నా అని పేర్కొన్నారు.

Also Read : ఒడిశా టు మహారాష్ట్ర, గంజాయి అక్రమ రవాణా.. సూర్యాపేటలో పట్టివేత..!

365 రోజుల్లో గా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రాజీవ్ యువ వికాసం అమలు చేస్తామని హామీ ఇచ్చి కేవలం పదివేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, యువ వికాసం జాడేలేదని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విలువైన విద్యా భరోసా కార్డు అందిస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక కార్డు ఇవ్వలేదని, మైనార్టీ సంక్షేమానికి నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి 1000 కోట్ల రూపాయల కంటే తక్కువ నిధులే విడుదల చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహాల జాబితాలకు అంతే లేదని కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు