Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ.. వివిధ కార్యక్రమాలకు హాజరు..!
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాదుకు చేరుకున్నారు.

హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ.. వివిధ కార్యక్రమాలకు హాజరు..!
మన సాక్షి, హైదరాబాద్ :
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాదుకు చేరుకున్నారు. అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. శనివారం హైదరాబాదులో జరగనున్న పలు కీలక కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న భారత్ సమ్మేట్ ముగింపు సభకు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు అవుతారు.









