Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESరాజకీయం

Revanth, Batti : పిసిసి చీఫ్ అతడే.. ఇక మంత్రులు కూడా ఖరారు.. ఢిల్లీకి చేరిన రేవంత్, భట్టి..!

Revanth, Batti : పిసిసి చీఫ్ అతడే.. ఇక మంత్రులు కూడా ఖరారు.. ఢిల్లీకి చేరిన రేవంత్, భట్టి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ పీసిసి చీఫ్ గా , ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగడం వల్ల పిసిసి పదవి వేరేవారికి ఇవ్వాలని అధిష్టానం భావించింది. అంతే కాకుండా పిసిసి పదవీకాలం కూడా మూడేళ్లు ముగియడంతో ఆస్థానంలో కొత్తవారిని నియమించేందుకు కసరత్తు కొనసాగుతుంది.

పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నవారి జాబితాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీకి చేరారు. ఇక వారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమై పిసిసి చీఫ్ ను ఎంపిక ఎంపిక చేయనున్నారు.

పిసిసి అధ్యక్ష పదవి రేసులో మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, బలరాం నాయక్ పేర్లు పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పై కూడా పార్టీ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉండగా మరో నలుగురికి కొత్తగా మంత్రి మండలిలో అవకాశం కల్పించనున్నారు.

మంత్రివర్గంలో కల్పించే అవకాశం ఉన్న నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి, బాలు నాయక్, రామచంద్రనాయక్ లు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు ఎమ్మెల్సీలు కోదండరాం కూడా మంత్రివర్గం రేసులో ఉన్నట్లు సమాచారం.

LATEST UPDATE : 

Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

మరిన్ని వార్తలు