Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : శిష్య ది స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..!

మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లోని శిష్య స్కూల్లో అంగరంగ వైభవంగా బాలల దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది.

Miryalaguda : శిష్య ది స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లోని శిష్య స్కూల్లో అంగరంగ వైభవంగా బాలల దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శిష్య స్కూల్ ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస రెడ్డి, కరస్పాండెంట్ శిరీష నెహ్రూ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

అదేవిధంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ షో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులు యూకేజీ అన్షు శ్రీ, ఝాన్సీ, లక్ష్మీబాయిగా, జాన్వి మిత్ర డాక్టర్ గా, నెహ్రుగా లవ కుమార్ , గోపికమ్మగా కృతిక, దాన్విక డాక్టర్లగా, ఎల్కేజీ నుండి అర్ణిక రుద్రమదేవిగా, తిష్య హెయిర్ హోష్టిస్గా, ఒమిక అన్షు లాయర్ గా , హస్వి నేతాజీగా, దేవాన్ష్ పోలీస్ గా, హరియాక్స్ దియాన్ష్ అల్లూరి సీతారామరాజు గా, అర్జున్ రాముడిగా, నర్సరీ నుండి నిషిత బటర్ఫ్లై గా, సుహాన్ పోలీసుగా, ఇంకా చాలామంది విద్యార్థులు ఎంతో చక్కగా వివిధ వేషధారణలో అలరించి, అందరి ప్రశంసలు పొందారు.

ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, జవహర్ లాల్ నెహ్రూ గురించి, స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్న విధానం, నెహ్రూ ఎడ్యుకేషన్ గురించి భారతదేశానికి తొలి ప్రధానిగా విదేశాంగ మంత్రిగా పనిచేశారని, ఆధునిక భారతదేశ నిర్మాణానికి భారీ పరిశ్రమలకు, విద్యాసంస్థలకు ఐఐటి ఐఐఎం లకు ఆయన బలమైన ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.

Also Read : Miryalaguda : సెయింట్ జాన్స్ హై స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..!

1947ఆగస్టు 15 న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1964 మరణించే వరకు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగారని, నేటి విద్యార్థులు రేపటి భావిభారత పౌరులని, విద్యార్థులను చక్కగా కొనియాడారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృత కార్యక్రమాలు క్రీడలు ఎంతో చక్కగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

మరిన్ని వార్తలు