Miryalaguda : మిర్యాలగూడలో డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్.. ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్.. ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులకు చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్పోర్ట్స్ మీట్లో భాగంగా విద్యార్థినులతో కలిసి వివిధ ఆటల్లో పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ విద్యార్థినులను అభినందిస్తూ, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థినులు తమలోని ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.











