Miryalaguda : ఎస్.వి. మోడల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..!
మిర్యాలగూడ పట్టణం వాసవి నగర్లోని ఎస్.వి. మోడల్ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Miryalaguda : ఎస్.వి. మోడల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణం వాసవి నగర్లోని ఎస్.వి. మోడల్ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ఓరుగంటి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, బాలలే దేశ భవిష్యత్తు అని, ప్రతి విద్యార్థిలోనూ అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని అన్నారు. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు.
Also Read : Miryalaguda : సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..!
పిల్లలకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, మానవత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సూచించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకొని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి చిన్నారి ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.









