Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : విదేశాలకు పంపడం, ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. ఎక్కడో, ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన అంతర్ రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారని అడిషనల్ ఎస్పి జి. రమేష్ పేర్కొన్నారు.

Nalgonda : విదేశాలకు పంపడం, ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. ఎక్కడో, ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

నల్లగొండ, మన సాక్షి :

విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన అంతర్ రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారని అడిషనల్ ఎస్పి జి. రమేష్ పేర్కొన్నారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాళ్ల లీలా కృష్ణ విదేశాల్లో ఉన్నత చదువులు చదివిస్తానని, అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక ల్యాప్‌టాప్, మూడు స్మార్ట్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు అనే ఆశ చూపి మోసం చేసిన ఘటన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిందని వివరాల్లోకి వెళితే, నల్లగొండ జిల్లా పోలేపల్లి రాంనగర్‌కు చెందిన కోయల కార్ కరుణభాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె కుమారుడిని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదివించి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారనే ఆరోపణల పై చింతపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వెల్లడించారు.

ఈ కేసును లోతుగా విచారిస్తుండగా, ముప్పాళ్ల లీలా కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఇతడు నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పలువురు విద్యార్థుల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. పట్టుబడిన నిందితుడు గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడి పరిచయాలను ఉపయోగించుకొని, భారతదేశానికి వచ్చిన అనంతరం చెడు వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడ్డాడని విచారణలో వెల్లడైందన్నారు.

విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించి ఇప్పటివరకు మొత్తం 8 మంది నుండి సుమారు రూ.85 లక్షల వరకు తీసుకొని మోసం చేసినట్లు గుర్తించారని తెలిపారు.ఈ విదంగా సంపాదించిన డబ్బులతో నిందితుడు కొంత డబ్బును విలాసాలకు , జల్సాలకు ఖర్చు పెట్టాడని తెలిపారు.

మాల్ గ్రామం మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని గుర్తించిన చింతపల్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో నిందితుడిపై ఇప్పటికే మాడుగులపల్లి పోలీస్ స్టేషన్, వరంగల్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో చీటింగ్ కేసులు నమోదై ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. యువతను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల్లో నియామకాలు చేయిస్తామని మోసగాళ్లు నమ్మిస్తున్నారని తెలిపారు.

ఉద్యోగాల పేరుతో ముందస్తుగా డబ్బులు అడగడం, నకిలీ నియామక పత్రాలు చూపించడం, వాట్సాప్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా తప్పుడు హామీలు ఇవ్వడం వంటి పద్ధతులతో అమాయకులను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. ఈ కేసులో నేరస్థుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబర్చిన నాంపల్లి సీఐ డి.రాజు, చింతపల్లి ఎస్‌ఐ ఎం.రామ్మూర్తి చింతపల్లి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.

MOST READ NEWS : 

  1. BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయి.. ఎన్నికల ముందు కొత్త నాటకం..!

  3. పండుగ పూట విషాదం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..!

  4. Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!

  5. Tragedy : శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. తెలంగాణకు చెందిన దంపతులు మృతి..!

మరిన్ని వార్తలు