Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఈ రహదారులకు మోక్షం ఎప్పుడు..?

చింతపల్లి మండల పరిధిలోని గతంలో వేసిన రహదారులు పూర్తిగా ధ్వంసమై కంకర తేలి గుంతల మయంగా మారి దర్శనమిస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యారు.

Nalgonda : ఈ రహదారులకు మోక్షం ఎప్పుడు..?

చింతపల్లి, మనసాక్షి.

చింతపల్లి మండల పరిధిలోని గతంలో వేసిన రహదారులు పూర్తిగా ధ్వంసమై కంకర తేలి గుంతల మయంగా మారి దర్శనమిస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యారు. చింతపల్లి మండలంలో మండల కేంద్రం నుండి వివిధ గ్రామాలకు వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కాలినడక ప్రయాణికులు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చేరుకోవాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.

ప్రభుత్వాలు మారుతున్న, అధికారులు మారుతున్న, ప్రజా ప్రతినిధులు మారుతున్నప్పటికీ రహదారులు మాత్రం బాగు చేయడంలో ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వహిస్తున్నారని చింతపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యల పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో నిర్లక్ష్యం వేస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

గత పది సంవత్సరాల క్రితం గ్రామాలను కలుపుతూ వేసిన సీసీ రోడ్లు పూర్తిగా ధ్వంసం కంకర తేలి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా,ప్రజా ప్రతినిధులు అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప రహదారుల పూర్తి అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మండల కేంద్రం నుండి వర్కలా, రాయిని గూడెం కిష్టరాయనపల్లి మీదగా మర్రిగూడెం మండలం వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది.

రాత్రి సమయంలో ఏ రహదారి వెంట ఆటోలు గానీ ద్విచక్ర వాహనాలు గాని ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది , ముఖ్యంగా ఈ రహదారి వెంట మూడు కల్వర్టులు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే వాగులు కల్వర్టులు దాటలేని పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం ఈ రహదారిపై ఉన్న మూడు కల్వర్టులు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి.

గతంలో వర్షాబా పరిస్థితుల కారణంగా కూలి పనులకు వెళ్లిన మహిళలు తిరిగి ఆటలో ఇంటికి చేరేందుకు వెళ్లగా ఆటో సైతం నీటి ప్రవాహం లో కొట్టుకుపోయి కొంతమంది మహిళలు ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు., ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులపై దృష్టి సారించి కంకర్ తేలి ప్రమాదకరంగా మారిన రహదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మరమ్మత్తులు చేయించాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.

MOST READ 

  1. Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ రూ.50వేలు తగ్గిన బంగారం ధర..!

  2. Gold Price : బంగారం ధరలో ఊహించని మార్పు.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!

  4. CM Revanth Reddy : బీఆర్ఎస్, బిజెపిలకు డిపాజిట్లు రావద్దు..!

మరిన్ని వార్తలు