Voter : ఓటరు జాబితా నుండి పేర్లను తొలగించాలి..!
Voter : ఓటరు జాబితా నుండి పేర్లను తొలగించాలి..!
మందమర్రి రూరల్, మాన సాక్షి:
మందమరి పట్టణవాసులు కొందరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మందమర్రి మండల పరిదిలోని గ్రామీణ ప్రాంతాలలో ఓటరుగా నమోదు చేయించుకున్నారని కాంగ్రెస్ బి. ఆర్.ఎస్ .బి.జె.పి. బీ.ఎస్పీ సి.పి.ఐ నాయకులు శనివారం రోజున మండల తహసీల్దార్ సతీష్ మండల ప్రజా పరిషత్ అధికారి రాజేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమర్రి పట్టణానికి చెందిన కొందరు నాయకులు గ్రామ పంచాయతీల ఓటరు జాబితాలలో పేర్లు నమోదు చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని చూస్తున్నారని తెలిపారు. వారి పేర్లను ఓటరు జాబితానుండి తొలగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోతు నీలయ్య, బిఆర్ఎస్ నాయకులు వేల్పుల రవి,బిజెపి నాయకులు గిర్నాటి జనార్దన్,సిపిఐ నాయకులు కామెర దుర్గారాజ్, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!
-
TG News : తెలంగాణలో రెండో ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించిన అల్ట్రావయొలెట్..!
-
Horticulture : రైతులకు భారీ శుభవార్త.. వారికి ఎకరానికి రూ.8వేలు సబ్సిడీ..!
-
Heavy Rain : నిండు గర్భిణి మహిళకి పురిటి నొప్పులు.. జేసీబీ సాయంతో ఒడ్డు దాటింపు..!









