నేలకొండపల్లి : ముగిసిన నామినేషన్ల పర్వం..!
నేలకొండపల్లి : ముగిసిన నామినేషన్ల పర్వం..!
9 డైరెక్టర్లకు గాను..31 మంది నామినేషన్లు
ప్రచారం ను ప్రారంభించిన ఖాసిం ఫ్యానల్
నేలకొండపల్లి , మన సాక్షి :
ఈ నెల 22 న జరగనున్న చెరువుమాధారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల కు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 12 నుంచి 14 వరకు నామినేషన్ల ను ఎన్నికల అధికారి ప్రసాద్ స్వీకరించారు. మొత్తం 9 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో 31 మంది నామినేషన్ల ను దాఖలు చేశారు.
జనరల్ కేటగిరి-24. ఎస్టీ కేటగిరి కి-3, మహిళ కేటగిరి కి-4 నామినేషన్ల వేశారు. చెరువుమాధారం సోసైటీ పరిధిలో రాజారాంపేట, మంగాపురంతండా, రాయగూడెం, చెరువుమాధారం గ్రామాల్లో మొత్తం 832 మంది సభ్యులు. ఉన్నారు. నామినేషన్ల పర్వం పూర్తి కావటంతోనే మాజీ అధ్యక్షుడు బాసీం -ఫ్యానల్ ఆయా గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు.
ALSO READ : TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!
ఈ నెల 15 వ తేదీన స్కూటీ 16న ఉపసంహరణ కార్యక్రమం నిర్వహించనున్నటు ఎన్నికల అధికారి తెలిపారు. సోసైటీ పరిధిలోని గ్రామాల్లో అప్పుడే పంచాయతీ ఎన్నికల జాతర ప్రారంభమైందా అనేలా ప్రచారం ప్రారంభించారు. మొత్తం మీద చెరువు ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ వీరి వెనక రాజకీయ నాయకులు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.
ఒక పక్క సొసైటీని ఏకగ్రీవం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. కానీ కొంత మంది మరో ప్రక్క ఎన్నికల రణ రంగంలోనే అమీతుమీ తెల్చుకుంటామని100% పేర్కొంటున్నారు. దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!









