Narayanpet : మున్సిపల్ కౌంటింగ్ వేళ జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. వారికి అనుమతి లేదు..!
జిల్లా కేంద్రంలోని సోషల్ ఎర్రగుట్ట దగ్గర ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Narayanpet : మున్సిపల్ కౌంటింగ్ వేళ జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. వారికి అనుమతి లేదు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లా కేంద్రంలోని సోషల్ ఎర్రగుట్ట దగ్గర ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల కౌన్సిలర్ల ఓట్ల లెక్కింపు సందర్భంగా నాలుగు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.(నేడు) శుక్రవారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద, సిసి కెమెరాలు, ఆర్మ్డ్ పోలీస్, సివిల్ పోలీసులతో మూడంచల భద్రత ఏర్పాటు చేసి, ప్రవేశ–నిష్క్రమణ మార్గాల వద్ద సీసీ కెమెరాలు ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేని వ్యక్తులు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఇతరులు పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్క్ చేయాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్‌లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు :
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్ (144) సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలేవరు గుంపులు గుంపులుగా ఉండరాదని, గెలిచిన వారికి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు అని మోడల్ కండక్ట్ కోడ్ అయిపోయిన తర్వాత పోలీసుల పర్మిషన్ తీసుకొని విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని ఎస్పీ తెలిపారు.
కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ టేబుళ్లు, అభ్యర్థుల ఏజెంట్లకు కేటాయించిన స్థానాలు, మీడియా పాయింట్ మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. లెక్కింపు ప్రక్రియ ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 550 మంది పోలీసులతో నాల్గు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివ శంకర్, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, నరేష్, పురుషోత్తం, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
-
Nalgonda : ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపోల్స్ లో తగ్గిన పోలింగ్ శాతం.. వార్డుల వారీగా వివరాలు ఇవీ..!
-
Nalgonda : జిల్లా ఎస్పీ కీలక ఆదేశం.. నల్గొండలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సందర్శన..!
-
ACB : రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన యువ ఎస్సై..!









