Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి.. పరామర్శించిన నేతలు..!

నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మిర్యాలగూడ పట్టణంలో 29వ వార్డు - బంగారుగడ్డలోని మ్యాడిసన్ హై స్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్ వద్ద జమీర్ అనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి.. పరామర్శించిన నేతలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మిర్యాలగూడ పట్టణంలో 29వ వార్డు – బంగారుగడ్డలోని మ్యాడిసన్ హై స్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్ వద్ద జమీర్ అనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన జమీర్ ను మెరుగైన వైద్య సేవల కోసం నల్లగొండలోని ఐకాన్ ఆస్పత్రికి తరలించారు.

ఐకాన్ ఆస్పత్రిలో వైద్య సేవలను పొందుతున్న జమీర్ ను మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహా రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను సూచించారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జావేద్ అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఓటమి భయంతో రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ నేతలు అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు