BIG BREAKING : ఏసీబీకి చిక్కిన ఉత్తమ అధికారి, ఆత్మహత్య చేసుకున్న ట్రైనీ డిప్యూటీ తాసిల్దార్.. మరెన్నో బ్రేకింగ్ న్యూస్ | ManaSakshi
మన సాక్షి లో బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. స్థానిక వార్తల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తోంది.

BIG BREAKING : ఏసీబీకి చిక్కిన ఉత్తమ అధికారి, ఆత్మహత్య చేసుకున్న ట్రైనీ డిప్యూటీ తాసిల్దార్.. మరెన్నో బ్రేకింగ్ న్యూస్ | ManaSakshi
మన సాక్షి, వెబ్ డెస్క్:
మన సాక్షి లో బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. స్థానిక వార్తల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తోంది.
మహిళా ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య :
మహబూబాబాద్‌లో గ్రూప్-2 ద్వారా ఉద్యోగం సాధించిన ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్ డోలి సంధ్య (28) ఆత్మహత్య చేసుకున్నారు.
సోమవారం రాత్రి సీతాకోకచిలకల సెంటర్ సమీపంలోని తన స్వగృహంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
——–
కీచక లెక్చరర్ కు దేహశుద్ధి :
నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కీచక లెక్చరర్ కు విద్యార్థులు దేహశుద్ధి చేశారు.
తెలుగు ఉపాధ్యాయుడు భాస్కర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు దేహశుద్ధి చేశారు.
వెంటనే అతనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట నిరసన తెలిపారు.
———
బురఖాలో వచ్చి.. రూ.10 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు :
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో చోటు చేసుకున్న ఘటన
ముక్కుపుడక కావాలని.. బురఖా ధరించి ఓ జ్యువెలరీ షాప్‌కి నలుగురు మహిళలు వెళ్లారు. సిబ్బందిని మాటల్లో దించి.. క్షణాల్లోనే రూ.10 లక్షల విలువైన ఆభరణాల బాక్స్ అపహరణ చేశారు.
సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ అధికారి!
ఒంగోలులో రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్పొరేషన్ ఆర్ఐ నరేంద్ర. కొత్త ఇంటికి పన్ను విధించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్న నరేంద్ర. మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
——
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన ర్యాలీ :
శక్తి స్కీం ద్వారా పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి తహశీల్దార్ ఆఫీస్‌కు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
———
హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీపై భారీ దాడులు :
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో H-FAST, ఫుడ్ సేఫ్టీ శాఖలు సంయుక్తంగా 130 కేంద్రాల్లో తనిఖీలు చేశాయి. 39 తయారీ యూనిట్లు, 91 విక్రయ కేంద్రాల్లో సోదాలు నిర్వహించి 25.5 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 36 టన్నుల పదార్థాలు సీజ్ చేశారు. ఇందులో 8.7 టన్నుల క్రీమ్, 1,200 లీటర్ల పామ్ ఆయిల్, 600 లీటర్ల వనస్పతి, 30 కిలోల స్టార్చ్, 3 రకాల కృత్రిమ నెయ్యి ఫ్లేవర్ల 6 బాటిళ్లు ఉన్నాయి. నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపి, స్వాధీనం చేసుకున్న స్టాక్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
పాలు లేని పదార్థాలు, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్, వనస్పతి, స్టార్చ్, కృత్రిమ ఫ్లేవర్లతో నెయ్యి తయారు చేసి ‘ప్యూర్ దేశీ నెయ్యి’ పేరుతో విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 10–40 శాతం వరకు కల్తీ ఉన్న నెయ్యిని పూజా నెయ్యి, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ యూనిట్లు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. క్రీమ్‌ను మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి తెచ్చినట్లు వెల్లడైంది.
——–
హనుమకొండ జిల్లాలో దారుణం, వ్యక్తి హత్య :
హనుమకొండ జిల్లా కాజిపేట మండలం రాంపూర్ ఊరచెరువు వద్ద పోలు వెంకటేశ్వర్లు (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని చిల్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
MOST READ
- బాలానగర్ లో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి..!
- Miryalaguda : ఎల్‌నినో ప్రభావం.. రైతులు వర్షాధార పంటలు సాగు చేయాలి..!
- రోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి పాటిస్తే ఎన్నో రోగాలకు చెక్!
- రోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి పాటిస్తే ఎన్నో రోగాలకు చెక్!
- అరిసెలు లేదా అడా లేకుండానే సింపుల్‌గా ‘పోహా అడా ప్రథమం’ తయారీ విధానం!











