Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
హైదరాబాద్ మేడిపల్లి లో భారీ చోరీ..!
హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. వరంగల్ హైవే మెయిన్ రోడ్డు కెనరా నగర్ బస్ స్టాప్ వద్ద ఉన్న క్యారెట్ లేన్ టాటా గోల్డ్ షాపులో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు.

హైదరాబాద్ మేడిపల్లి లో భారీ చోరీ..!
మన సాక్షి, మేడిపల్లి :
హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. వరంగల్ హైవే మెయిన్ రోడ్డు కెనరా నగర్ బస్ స్టాప్ వద్ద ఉన్న క్యారెట్ లేన్ టాటా గోల్డ్ షాపులో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. షట్టర్ తొలగించి షాపులోకి ఏడుగురు దొంగలు ప్రవేశించారు. సుమారు ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలను అపహరించినట్లు తెలుస్తోంది.
షాప్ లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బిల్డింగ్ వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో మేడిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరం చేశారు. చోరీకి గురైన వజ్రాలు, బంగారం పూర్తి వివరాలను సేకరించారు.









