Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Nizamabad : పోలీస్ స్టేషన్ లోనే నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన హోటల్ యజమాని..!
పోలీస్ స్టేషన్ లోని నిప్పంటించుకుని హోటల్ యజమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ పోలీస్ స్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది.

Nizamabad : పోలీస్ స్టేషన్ లోనే నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన హోటల్ యజమాని..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
పోలీస్ స్టేషన్ లోని నిప్పంటించుకుని హోటల్ యజమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ పోలీస్ స్టేషన్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భీంగల్ లో సుధాకర్ హోటల్ నడుపుతున్నాడు. కాగా హోటల్ బయట 10 గంటలకు టేబుల్స్ వేశాడని పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
దాంతో సోమవారం పోలీస్ స్టేషన్ కు రావాలని సుధాకర్ ను పిలిపించడంతో సుధాకర్ పోలీస్ స్టేషన్ లో వెంట తెచ్చుకున్న ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు స్టేషన్ లో ఉన్నవారు వెంటనే మంటలు ఆర్పి అతడిని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల కారణంగానే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.









