Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

NDA : ఒకరోజు ముందే సెప్టెంబర్ పింఛన్ల పంపిణీ.. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పుష్పాభిషేకం..!

NDA : ఒకరోజు ముందే సెప్టెంబర్ పింఛన్ల పంపిణీ.. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పుష్పాభిషేకం..!

మదనపల్లి, మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ లో వృద్ధులకు, వికలాంగులకు సెప్టెంబర్ నెల పింఛన్లు ఒకరోజు ముందే ( ఆగస్టు 31) పంపిణీ చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ముందస్తుగా చాటింపు నిర్వహించి పండుగలా.. పింఛన్లు పంపిణీ చేశారు. దాంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి దాసరిపల్లి జయచంద్రా రెడ్డి సూచనల మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగినది.

కురబలకోట మండలం మనమరెడ్డి గారి పల్లి గ్రామపంచాయతీ ఆర్సి కురవపల్లి నందు పెన్షన్ల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మట్లి వారి పల్లి మాజీ సర్పంచ్ రుద్ర బాలకృష్ణ సరస్వతి ఆధ్వర్యంలో వనమ రెడ్డి గారి పల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఒక్కరోజు ముందుగా కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేసింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెన్షన్ దారులు ఎంతో సంతోషంగా ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చామంతి రెడ్డప్ప, దేవ రెడ్డి చంద్రశేఖర, పొల్లగంటి శ్రీనివాసులు, బండ్ల అశోక్, పుల్లగంటి రమణ, వై మల్లికార్జున నాయుడు, నెంబర్ మల్లికార్జున నాయుడు, గంగాధర, హరి బాబు చలపతి రవీంద్రబాబు తదితరులు పెన్షన్ దారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు.

LATEST UPDATE :

TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!

District SP : పగలు, రాత్రి 24/7 పెట్రొలింగ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం..!

ఫ్లాష్ న్యూస్ : సెల్ఫీ దిగుతూ సాగర్ ఎడమ కాలువలో పడిన మహిళ.. కాపాడిన స్థానికులు..!

Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!

Nelakondapally : నేలకొండపల్లిలో తెల్ల త్రాచు కలకలం..!

మరిన్ని వార్తలు